- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sesame : పసుపు తర్వాత నువ్వుల సాగు చేస్తే లాభాలు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్రలోనూ పసుపు( Turmeric)పంట దిగుబడుల సేకరణ పూర్తయ్యి మార్కెటింగ్ సాగుతోంది. పసుపు పంట తర్వాత రైతులు తమ భూముల్లో ఏ పంటలు వేస్తే లాభాలు వస్తాయన్నదానిపై వ్యవసాయ నిపుణులు రైతులకు పలు సూచనలు చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్రలోనూ పసుపు( Turmeric)పంట దిగుబడుల సేకరణ పూర్తయ్యి మార్కెటింగ్ సాగుతోంది. పసుపు పంట తర్వాత రైతులు తమ భూముల్లో ఏ పంటలు వేస్తే లాభాలు వస్తాయన్నదానిపై వ్యవసాయ నిపుణులు రైతులకు పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక పంటల సాగు కాలం సుమారు 250 నుండి 280 రోజులు పంటకాలం కలిగి ఉంటాయి. అందుకే చాలమంది అవగాహాన ఉన్న రైతులు పసుపు పంట దిగుబడుల తర్వాత రెండవ పంటగా స్వల్పకాలిక పంట నువ్వు(Sesame)సాగు చేస్తున్నారు.
సాధారణంగా పసుపులో పశువుల ఎరువులు అధిక మోతాదులో రైతులు వేయడం జరుగుతుంది. అలాగే పసుపు పంటకాలంలో అందించే వివిధ పోషకాలు నేలలో కొంతమేర లభ్యస్థితిలో ఉంటాయి. ఈ లభ్యస్థితిలో ఉన్న పోషకాలను తర్వాతి పంట అయిన నువ్వు సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ తక్కువ ఖర్చులో మనం నువ్వు సాగుని చేపట్టవచ్చు. పసుపులో సేంద్రియ ఎరువుల వాడకం మిగతా పంటలతో పోలిస్తే ఎక్కువగా ఉండడం అలాగే రెండో పంట అయిన నువ్వు సాగుకు ఆ పోషకాలు తోడ్పడతాయి.
ఈ నేలలు అనకూలం
నీరు నిలవని తేలికైన నేలలు అలాగే మధ్యస్థ బరువైన నేలలు నువ్వు సాగుకు చాలా అనుకూలం. పసుపు సాగు చేయడం వల్ల నేల గుల్లబారి అధిక పోషక లభ్యతతో ఉండడం వల్ల పసుపు సాగు అనంతరం నువ్వు సాగు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇందుకుగాను నేలని రెండుసార్లు దుక్కి దున్ని తయారు చేసుకోవాలి. ఎకరానికి రెండున్నర కిలోల విత్తనం సాగుకు సరిపోతుంది. ఈ విత్తనాన్ని మూడింతలు ఇసుకతో కలిపి గొర్రుతో వారుసలలో విత్తుకోవచ్చు. ఇలా వరుసల మధ్య 30 సెంటీమీటర్లు మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా మనం వితుకునట్లయితే మొక్క ఎదుగుదల బాగుండి మంచి నాణ్యమైన పంటను మనం పొందవచ్చు. నువ్వుల రకాలైన శ్వేత హిమ అలాగే జగిత్యాల తిల్ -1 రకాలు 80 నుంచి 90 రోజుల పంట కాలంలో మనకి సాగు చేసుకోవచ్చు ఈ విత్తనానికి విత్తనానికి ముందు కిలో విత్తనానికి మూడు గ్రాముల మాంకోజేబ్ తో విత్తన శుద్దిని చేసుకోవాలి.
సస్యరక్షణ చర్యలతో లాభసాటి దిగుబడులు
నువ్వు పంటను రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవడానికి ఇమిడాక్లోప్రిడ్ రెండు మిల్లీ లీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలు వచ్చే రసం పిలిచే పురుగులు బారి నుండి కాపాడవచ్చు. ఇక ఎరువుల విషయానికి వస్తే సాధారణంగా ఎకరానికి 16 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు ఎనిమిది కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు అలాగే 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువును వేసుకోవాలి. దీనిలో పసుపు పంట సాగు అనంతరం లభ్యమయ్యే పోషకాల్ని ద్వారా రైతు సోదరులు ఎరువుల వినియోగం తగ్గించు కోవచ్చు
నువ్వులో విత్తిన వెంటనే తడి ఇచ్చుకుంటూ పూత, కాయ సమయంలో తప్పని సరిగా ఇవ్వాలి. నువ్వులు ప్రధానంగా ఆశించే రసం పిలిచే పురుగులైన పేనుబంక తామర పురుగు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు పంట దశలో ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ ఒక గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అలాగే ఆకు ముడత మరియు కాయ తోలచు పురుగు గమనించినట్లయితే ప్రొఫెనోఫాస్ 2 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ విధంగా తక్కువ ఖర్చులో నువ్వు సాగు చేయడం ద్వారా రైతులు 4 నుండి 6 క్వింటాళ్లు ఎకరానికి నువ్వుల దిగబడి సాధిస్తూ అధిక ఆదాయాన్ని పొందవచ్చు.






