Big Breaking News : తెలంగాణలో మందుబాబులకు మరో షాక్

by M.Rajitha |
Big Breaking News : తెలంగాణలో మందుబాబులకు మరో షాక్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో మద్యం ప్రియులకు భారీ షాక్ తగలనుంది. మందుబాబులకు ఎంతో ఇష్టమైన బీర్ల ధరలు(Beers Prices) పెరగనున్నాయి. బీర్ల సరఫరాదారులకు 15 శాతం ధరల పెంపును సిఫారసు చేసిన రిటైర్డ్ జడ్జీ జైస్వాల్(Rt. Judge Jaiswal) నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ(price fixation commitee) తన నివేదికను ప్రభుత్వానికి అందజేయగా.. తాజాగా ప్రభుత్వం బీర్ల ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ సిఫారసు మేరకు సరఫరాదారులకు ప్రస్తుతం ఉన్న ఎమ్మార్పీ ధరపై ఏకంగా 15 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా పెరిగిన ధరలు రేపటి (ఫిబ్రవరి 11) నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే గత నెలలో బీర్ల ధరలు పెంచకపోవడం వలన తమకు ఎలాంటి ఉత్పత్తి ప్రయోజనం లేకుండా పోయిందని, బీర్ల సరఫరా సంస్థ యుబిఐ తెలంగాణలో ప్రముఖ బీర్ల సరఫరా నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి.. బీర్ల ధరలు ఎంతమేరకు పెంచవచ్చునో తెలియజేయాలని రిటైర్డ్ జడ్జీ జైస్వాల్ ఆధ్వర్యంలో ధరల నిర్ణయ కమిటీని వేయగా.. ఆ కమిటీ నివేదిక ప్రకారం నేడు ప్రభుత్వం బీర్ల ధరలు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. అదే విధంగా ఏపీలో కూడా లిక్కర్ ధరలను 15 శాతం పెంచుతూ కూటమి ప్రభుత్వం(AP gvt) ఉత్తర్వులు జారీ చేసింది. వెరసి రెండు తెలుగు రాష్ట్రాల మద్యం ప్రియులకు ఈ భారీ ధరలు పెద్ద షాక్ అని చెప్పవచ్చు.

Next Story

Most Viewed