- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : బీచ్ అంటే అందరికీ భలే హుషారు వస్తుంది. సముద్రం ఒడ్డున వచ్చి పోయే అలలతో ఆడుకోవడం, బీచ్ ఒడ్డున కూర్చొని సముద్రాన్ని చూస్తూ గడపడం మనసుకు ఉత్తేజాన్ని ఇస్తుంది. అయితే ఇదంతా సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేవారికే సాధ్యం అవుతుంది గాని, తీర ప్రాంతం లేని వాళ్ళు మాత్రం ఉసూరుమనాల్సిందే. లేదంటే ఏడాదికో ఆర్నెల్లకో ప్రత్యేకంగా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లి అక్కడ రెండు మూడు రోజులు గడిపి వస్తారు. ఇప్పటి వరకు హైదరాబాద్ వాసుల పరిస్థితి ఇదే. బీచ్ కి వెళ్ళాలి అంటే గోవా, వైజాగ్, కేరళకో వెళ్లేవారు. ఇంకా డబ్బులు ఉన్నవాళ్ళైతే విదేశాల్లో ఉన్న బీచ్ లకు వెళ్లి గడిపి వస్తుంటారు. కానీ ఇప్పుడా పరిస్థితి మారనుంది.
హైదరాబాద్ కే బీచ్ తీసుకురానున్నారు త్వరలో. కానీ సముద్రం లేకుండా ఇక్కడికి బీచ్ ఎలా తీసుకు వస్తారు అనుకుంటున్నారా? లేక ఏప్రిల్ వెళ్ళిపోయాక కూడా ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఇదో ప్రాంక్ అనుకుంటున్నారేమో.. కానీ అది నిజం. త్వరలోనే నగరానికి బీచ్ ను తీసుకురానున్నారు. అయితే అది కృత్రిమ బీచ్. నగరంలోని కొత్వాల్ గూడలో ఈ కృత్రిమ బీచ్ నెలకొల్పేందుకు ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది.
ప్రభుత్వ-ప్రయివేట్ పార్ట్నర్ షిప్ పద్ధతిలో, సుమారు 35 ఎకరాల్లో రూ.225 కోట్లతో వ్యయంతో డిసెంబర్ నుంచి ఈ ఆర్టిఫీషియల్ బీచ్ నిర్మాణం పనులు మొదలు కానున్నాయి. బీచ్ లో ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, థియేటర్స్, ఫుడ్ కోర్ట్స్, వంటివి కూడా ఉండనున్నాయి. ఇక హైదరాబాద్ పీపుల్ బీచ్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదన్నమాట. నగరంలోనే ఉంటూ.. వారాంతాలు ఈ బీచ్ కి వెళ్లి ఎంజాయ్ చేసి రావొచ్చు.






