Congress: హీటెక్కిన కులగణన రాజకీయం.. గవర్నర్ ను కలిసిన టీ కాంగ్రెస్ బీసీ నేతలు

by Prasad Jukanti |   (  Updated:2025-05-02 06:49:39  IST  )

తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు.

Congress: హీటెక్కిన కులగణన రాజకీయం.. గవర్నర్ ను కలిసిన టీ కాంగ్రెస్ బీసీ నేతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాబోయే జనాభా లెక్కలతో పాటే కులగణన నిర్వహించేందుకు సిద్ధం అని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో ‘క్యాస్ట్ సెన్సస్ (Cast Census) పాలిటిక్స్’ హీటెక్కుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) ఆమోదం తెలిపి దానిని రాష్ట్రపతికి పంపడంపై తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు (T Congress BC leaders) ఇవాళ గవర్నర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ రాజ్ భవన్ కు వెళ్లిన కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. దేశవ్యాప్తంగా కులగణన జరపాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బలహీన వర్గాలకు చెందిన వారందరం స్వాగతిస్తున్నామని చెప్పారు. కులగణన తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని, కులగణనను గతంలో విమర్శించినవారే ఇప్పుడు ఆదర్శంగా తీసుకున్నారన్నారు. రాహుల్ గాంధీ పోరాట ఫలితమే కేంద్ర కేబినెట్ నిర్ణయం అని రాహుల్ గాంధీ నినాదం ఇప్పుడు ఆచరణలోకి వచ్చిందన్నారు. రేవంత్ పాలనలో కులగణన జరగడంతో కేంద్రం దిగి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనను కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటే బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

Next Story