- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వనపర్తి జిల్లాకు చెందిన వసంత బీటెక్ సెకండియర్ చదువుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: బాసర ట్రిపుల్ ఐటీలో (Basara IIIT) ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ, హాస్టల్ పరిసరాల్లో ఈ ఘటన కలకలం రేపింది. వనపర్తి జిల్లాకు చెందిన వసంత అనే విద్యార్థిని బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. ఉన్నట్లుండి ఆమె ఆత్మహత్యకు పాల్పడటంతో తోటి విద్యార్థినులు దిగ్భ్రాంతి చెందారు. మృతురాలి తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం సమాచారం అందించింది. పోలీసులు అక్కడికి చేరుకుని వసంత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వసంత ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కళాశాల ఉపకులపతిని సంప్రదించేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించినప్పటికీ, ఆయన అందుబాటులో లేరని సిబ్బంది చెప్తున్నారు. ఆస్పత్రి వద్ద పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేసి.. మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
కాగా.. గతంలోనూ బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చదువుల ఒత్తిడి భరించలేకనే వారు చనిపోయినట్లు సూసైడ్ నోట్ల ద్వారా పోలీసులు ధృవీకరించారు. స్వాతిప్రియ అనే పీయూసీ సెకండ్ ఇయర్ విద్యార్థిని 2024 నవంబర్ లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె సూసైడ్ నోట్ లో ఒంటరితనం, డిప్రెషన్ కారణంగానే చనిపోతున్నట్లు రాసినట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు. అదే ఏడాది ఏప్రిల్ లో అరవింద్.. పరీక్షలకు రెండ్రోజుల ముందు సూసైడ్ కు పాల్పడ్డాడు. హాజరు శాతం తక్కువగా ఉండటంతో ఇంటికి సమాచారం వెళ్తుందనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.






