- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Banjara Hills: ఘోర ప్రమాదం.. పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారి మీదకు దూసుకెళ్లిన కారు
బంజారాహిల్స్(Banjara Hills) లో ఘోర ప్రమాదం(Fatal Accident) చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: బంజారాహిల్స్(Banjara Hills) లో ఘోర ప్రమాదం(Fatal Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడే మృతి(Spot Died) చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి(Basavatharakam Cancer Hospital) వద్ద శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ కారు అతి వేగంగా వచ్చి ఫుట్ పాత్(Foot Path) మీదకు దూసుకెళ్లింది. ఆ సమయంలో ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తులపై పై నుంచి వెళ్లడంతో ఓ వ్యక్తి స్పాట్ లోనే ప్రాణాలు విడిచాడు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ముగ్గురు వ్యక్తులు కారు విడిచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నామని, కారు నంబర్ ఆధారంగా నిందితులను ట్రేస్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.






