- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandru Shobha: కేటీఆర్ విలన్‌కు తక్కువ.. జోకర్‌కు ఎక్కువ: బండ్రు శోభారాణి ఘాటు వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ (KTR) వ్యాఖ్యలపై స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి (Bandru Shobha Rani) మండిపడ్డారు. ఇప్పటికే నువ్వు విలన్‌కు తక్కువ.. జోకర్‌కు ఎక్కువ అయిపోయాడని విమర్శించారు. కేటీఆర్ అనవసరమైన మాటలు మాట్లాడకు.. మీ పని అయిపోయింది అని ఫైర్ అయ్యారు. మీరు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు, ఏం మొహం పెట్టుకోని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. గాడిదలను చూస్తూనే గుర్రాల విలువ తెలుస్తదని కేటీఆర్ కామెంట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజంగానే గాడిదల పరిపాలన అయిపోయిందని, గుర్రాల పరిగెత్తించే సమయం నేడు ఆసన్నం అయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో (Davos) దావోస్‌లో తెలంగాణకు రూ. 1.78 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. కేటీఆర్.. మీరు గాడిదలు కాబట్టే.. గతంలో రాష్ట్రానికి ఏమి తీసుకరాకుండా గాడిద పళ్లు తోమరని విమర్శించారు. తెలంగాణకు కేటీఆర్ ఏం చేశాడని ఇలా మాట్లాడుతున్నాడు? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు వస్తుంటే అభినందించాలి.. లేదంటే నోరు మూసుకొని కూర్చోవాలని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్...జోకర్ కు ఎక్కువ... విలన్ కు తక్కువ...కేటీఆర్ పని అయిపోయింది -- బండ్రు శోభారాణి#DigestTheGrowth pic.twitter.com/UQVZyAiO8r
— Congress for Telangana (@Congress4TS) January 27, 2025






