Bandi Sanjay: దాశరథి శత జయంతి సందర్భంగా బండి సంజయ్ స్పెషల్ ట్వీట్..!

by Ramesh Goud |

తన అక్షరాల్లో అగ్నిధారలను కురిపించిన కవితా భాస్కరుడు, అంగారాన్ని, శృంగారాన్ని కవిత్వీకరించిన సవ్యసాచి.. దాశరథి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పెషల్ ట్వీట్ చేశారు.

Bandi Sanjay: దాశరథి శత జయంతి సందర్భంగా బండి సంజయ్ స్పెషల్ ట్వీట్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తన అక్షరాల్లో అగ్నిధారలను కురిపించిన కవితా భాస్కరుడు, అంగారాన్ని, శృంగారాన్ని కవిత్వీకరించిన సవ్యసాచి.. దాశరథి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పెషల్ ట్వీట్ చేశారు. దాశరథి శత జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయన ఫోటోను పోస్ట్ చేసిన బండి సంజయ్ ఆయన గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నిరంకుశ నిజాం పాలనను గొంతెత్తి వ్యతిరేకించిన ప్రజాగళం.. "నా తెలంగాణ కోటి రతనాల వీణ" అంటూ తెలంగాణ ఔన్నత్యాన్ని చాటిన కలం.. తన అక్షరాల్లో అగ్నిధారలను కురిపించిన కవితా భాస్కరుడు.. అని అన్నారు. అలాగే తిమిరంతో సమరం చేసి రుద్రవీణలు మ్రోగించి, మహాంధ్రోదయమై ఉదయించిన సూరీడు.. అని చెప్పారు. అంతేగాక ఒకవైపు అంగారాన్ని.. మరొకవైపు శృంగారాన్ని కవిత్వీకరించిన సవ్యసాచి, తెలంగాణ సాహిత్య సారథి.. ఆయనే మన దాశరథి అని కొనియాడారు. ఇక నేడు ఆ మహానుభావుడి శతజయంతి సందర్భంగా నా నమస్సుమాంజలులు అని బండి సంజయ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

Next Story