- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మీ నాన్నను మంచిగా చూసుకోవాల్సింది నువ్వే’.. కవితకు బండి సంజయ్ షాకింగ్ సందేశం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఎన్నికల ప్రచారం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరచూ పాకిస్తాన్‌పై ప్రేమ కురిపిస్తున్న కాంగ్రెస్ వాళ్లను చూస్తే నాకు అనుమానం వస్తోంది.. కచ్చితంగా వీళ్ల డీఎన్ఏను చెక్ చేయాల్సిందే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పెద్ద మూర్ఖుడు.. ఆయన కొడుకు ఇంకా మూర్ఖుడు.. అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య ఎక్కడ చూసినా తెలంగాణ భవన్‌ను కేటీఆర్ జనతా గ్యారేజ్ అంటూ డైలాగులు కొడుతున్నాడని విమర్శించారు. అధికారం కోల్పోగానే కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు వెళ్లాడు.. మూడేళ్లుగా బయటకు రావట్లేడని విమర్శించారు. జనం చస్తుంటే రాడు.. రైతులు అల్లాడుతుంటే రాడు. యాక్సిడెంట్స్ అయి జనం పోతుంటే రాడు.. పైగా మా అయ్య మళ్లీ సీఎం అవుతాడు అని కేటీఆర్ ప్రకటనలు చేస్తుండు అని బండి సంజయ్ సీరియస్ అయ్యారు.
‘అసలు కేటీఆర్‌కు తండ్రి సీఎం కావాలనే ఆశ లేనే లేదు.. తండ్రిని పక్కకు తోసి తానే సీఎం కావాలని చూస్తున్నడు’ అని అన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవితకు బండి సంజయ్ కీలక సందేశం పంపించారు. కేసీఆర్‌ను కేటీఆర్ మంచిగా చూసుకోడు.. తల్లిదండ్రులను మంచిగా చూసుకునేది ఆడబిడ్డలే.. అందుకే కవితను కోరుతున్నా.. మీ నాన్నను మంచిగా చూసుకో.. చివరి రోజుల్లో ఇంత ముద్ద పడేయ్ అని కవితకు బండి సంజయ్ సూచించారు. మాగంటి గోపీనాథ్ చావుకు కారణం కేటీఆరేనని ఆమె తల్లే చెబుతోంది. గోపీనాథ్ మరణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి రోషం, పౌరుషం ఉంటే కేటీఆర్‌ను లోపలేసి థర్డ్ డిగ్రీ చేసి విచారణ జరపాలని అన్నారు.






