- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే పార్టీలన్నీ పార్లమెంట్‌లో బిల్లుకు మద్దతివ్వాలని కోరారు. ఈ బిల్లును వ్యతిరేకించే పార్టీలకు మహిళలే బుద్ధి చెబుతారని అన్నారు. మహిళలకు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనేది దశాబ్దాల నాటి కల అని గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు. మహిళల ఆశలు, ఆకాంక్షలకు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతీక అని చెప్పారు. పార్లమెంట్‌లో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిందే అని అన్నారు. డీలిమిటేషన్‌తో పార్లమెంట్‌లో స్థానాలు పెరుగుతాయి. ఈ బిల్లుతో తెలంగాణలోనూ 60 మంది మహిళలు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుకు మద్దతు కోరుతూ అన్ని పార్టీల ఫోర్ల్ లీడర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేఖ రాశారు. వ్యక్తులు, పార్టీలకు అతీతంగా చట్టాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేసేందుకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. 2029 లోక్‌సభ ఎన్నికలను మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌తో నిర్వహిద్దామని అన్నారు.






