- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మ పేరుతో మొక్క నాటి కాపాడుకోవాలి.. బండి సంజయ్ కీలక పిలుపు
భవిష్యత్ తరాల పరిరక్షణకు మొక్కలు పెంపకమే పరిష్కారమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: భవిష్యత్ తరాల పరిరక్షణకు మొక్కలు పెంపకమే పరిష్కారమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. భారతీయ పౌరులందరూ తమ తల్లి పేరుతో ఒక్కో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపాడాలని కోరారు. గురువారం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీ జంతర్ మంతర్‌లోని తన అధికారిక నివాసంలో తన కార్యాలయ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. మొక్కల పెంపకం ద్వారా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు. వాతావరణ మార్పులపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అట్లాగే జీవ వైవిధ్య పరిరక్షణ, భవిష్యత్ తరాలకు హరిత భూమిని అందించేందుకు మనమంతా సామూహిక బాధ్యతగా భావించాలని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగితోపాటు ప్రతీ భారతీయ పౌరుడు ఏక్ పేడ్ మా కే నామ్ నినాదంతో తమ తల్లి పేరుతో ఒక్కో మొక్కను నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణ అనేది ఇంటి నుంచే ప్రారంభమవుతుందని, తల్లుల అనురాగానికి, పోషణకు గుర్తుగా మొక్కలు నాటడం ఒక అర్థవంతమైన నివాళి అవుతుందని చెప్పారు.






