ఆ బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.. రాజలింగమూర్తి హత్యపై బండి సంజయ్ రియాక్షన్

by Gantepaka Srikanth |

ప్రముఖ సామాజికవేత్త రాజలింగమూర్తి హత్య(Rajalingamurthy Murder) తెలంగాణలో సంచలనంగా మారింది. కొందరు దుండగులు కత్తులతో దాడిచేసి అత్యంత విచక్షణారహితంగా బుధవారం రాత్రి చంపారు.

ఆ బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.. రాజలింగమూర్తి హత్యపై బండి సంజయ్ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సామాజికవేత్త రాజలింగమూర్తి హత్య(Rajalingamurthy Murder) తెలంగాణలో సంచలనంగా మారింది. కొందరు దుండగులు కత్తులతో దాడిచేసి అత్యంత విచక్షణారహితంగా బుధవారం రాత్రి చంపారు. మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barrage) నిర్మాణంలో అవినీతి జరిగిందని గత కొంతకాలంగా రాజలింగమూర్తి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. తాజాగా ఈ హత్యపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు.

భూపాలపల్లి(Bhupalpally) రాజలింగమూర్తి హత్యపై విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అన్నారు. ఒక వ్యక్తిని ప్రాణం తీయడమంటే అంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. హతుడి భార్య చేస్తున్న ఆరోపణలపై లోతైన విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంక్వైరీ కాకముందే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సరికాదని అన్నారు.

Next Story