పాతబస్తీలో అంబేద్కర్ విగ్రహం ఎక్కడైనా ఉందా?.. MP అసద్‌కు బండి సంజయ్ కౌంటర్

by Gantepaka Srikanth |

దారుస్సలంలో ఎమ్ఐఎమ్(MIM) నిర్వహించిన సభకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సహకరించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు.

పాతబస్తీలో అంబేద్కర్ విగ్రహం ఎక్కడైనా ఉందా?.. MP అసద్‌కు బండి సంజయ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: దారుస్సలంలో ఎమ్ఐఎమ్(MIM) నిర్వహించిన సభకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సహకరించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. బడాబాబులు, బడాచోర్‌లు కలిసి మీటింగ్‌లు పెట్టుకున్నారని విమర్శించారు. అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని గుర్తుచేశారు. పాతబస్తీలో ఎక్కడైనా అంబేద్కర్(Ambedkar) విగ్రహం ఉందా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుపై తమకు నమ్మకం ఉందని అన్నారు. తాము సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఏ పని చేయబోమని ప్రకటించారు. తెలంగాణలో వడగళ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఇప్పటివరకు ఎంతమంది పరిహారం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా.. నిన్న దారుస్సలం సభలో అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ముస్లింలను విభజించి బలహీన పరిచేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ముస్లింలపై కక్షసాధింపుగా రాజ్యాంగ వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. దాన్ని ఉపసంహరించుకునేంత వరకూ అన్ని వర్గాలతో కలిసి దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని కీలక ప్రకటన చేశారు. అంబేడ్కర్‌ కంటే తానే గొప్ప వ్యక్తిననే తరహాలో మోడీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ 11 ఏళ్లుగా ముస్లింలను అణిచివేయటానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తాజాగా అసద్ వ్యాఖ్యలకు బండి సంజయ్ స్పందించి కౌంటర్ ఇచ్చారు.

Next Story