Bandi Sanjay: ఆ వాగ్ధానాలు అమలు చేయలేకపోయారు.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ

by Kema Shiva Kumar |

ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.

Bandi Sanjay: ఆ వాగ్ధానాలు అమలు చేయలేకపోయారు.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లేఖ రాశారు. ఆ లేఖలో రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రైతు భరోసా (Raithu Bharosa), ఇందిరమ్మ ఇండ్లు (Idiramma Houses), కొత్త రేషన్ కార్డులు (New Ration Cards), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (Indiramma Aathmiya Bharosa) అమలు చేస్తామని ప్రకటించి అందులో.. 3 శాతం మందికి కూడా లబ్ధి చేకూర్చకపోవడం బాధకరమని అన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మందికి రైతుల ఖాతాల్లో ప్రతి ఏటా రూ.20 వేల కోట్లను జమ చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింది భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇస్తామని చెప్పారని తెలిపారు.

40 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు (New Ration Cards), సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. కానీ, ఇచ్చి హామీల్లో ఏ ఒక్కటి పూర్తి అమలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 12,991 పంచాయతీలు ఉండగా.. మండలానికి ఒక గ్రామం చొప్పున కేవలం 561 గ్రామాల్లో మాత్రమే నాలుగు పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులంటే అందులో 4,41,911 మందికే ఎకరాకు రూ.6 వేలు జమ చేయడం బాధకరమని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు కేవలం 42,267 మంది మాత్రమే గుర్తించడం విస్మయం కలిగిస్తుందని అన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది పేదలు ఇండ్లకు అర్హులుగా తేలగా.. నేటికీ 72,406 మాత్రమే ఇండ్లు మంజూరు చేశారని ఆరోపించారు. నాలుగు పథకాలకు గాను ప్రభుత్వం అర్హులుగా తేల్చిన కుటుంబాల్లో 3 శాతం మందకి కూడా నేటి లబ్ధి చేకూర్చకపోవడం సిగ్గుచేటని బండి సంజయ్ ఆక్షేపిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

Next Story