Bandi Sanjay : కేసీఆర్‌ను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు : బండి సంజయ్

by Muthe.Rajitha |   (  Updated:2024-11-09 15:12:35  IST  )

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR) పై బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay : కేసీఆర్‌ను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు : బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR) పై బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని హాట్ కామెంట్స్ చేశారు. జనం ఎన్నో కష్టాల్లో ఉంటే కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌస్‌ లోనే ఉన్నారని, అది దాటి వచ్చి ఒక్కరినీ కూడా ఓదార్చలేదని, అలాంటి వ్యక్తిని ప్రజలు లీడర్ గా గుర్తుంచుకుంటారా అని ప్రశ్నించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ పై బండి కీలక వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్ల భావజాలం ఉన్నవారికి విద్యా కమిషన్ లో చోటు కల్పించారని మండి పడ్డారు. తక్షణమే విద్యా కమిషన్ ను రద్దు చేయాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మహారాష్ట్రలో అబద్దాలు చెప్పారని.. ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు చేశామని పాదయాత్ర చేసే దమ్ముందా అంటూ సీఎంను ప్రశ్నించారు.

Next Story