- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టులను ఎదురించిన తీరు అద్భుతం: బండి సంజయ్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జరిగిన ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జరిగిన ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలపై గత 75 సంవత్సరాలకు పైగా అలుపెరుగకుండా నిరంతరం పోరాడుతున్న ఏబీవీపీ చరిత్ర గురించి, మావోయిస్టులను ఎదురించిన తీరు గురించి వివరించారు. ఏబీవీపీ కార్యకర్తల దేశభక్తిని, మనోధైర్యాన్ని ప్రశంసించారు. జాతీయవాద అంశాలు, సరిహద్దు భద్రత, ఆర్టికల్ 370 రద్దుతో పాటు అయోధ్య రామమందిర నిర్మాణం కోసం పోరాడిన ఏబీవీపీ చరిత్రను కూడా ప్రస్తావించారు.
ఈ సభలకు విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు హెచ్ సీయూ ప్రొఫెసర్ రావుల క్రిష్ణ, కార్యదర్శి రాంబాబు, కర్నె రామచందర్, గీతాసింగ్, భీమనపల్లి శ్రీకాంత్ హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా పానగల్‌కు చెందిన సామాజిక కార్యకర్త, హెచ్ఐవీ బాధితులకు, వారి పిల్లలకు అనేక రకాలుగా సేవలందిస్తున్న భీమనపల్లి శ్రీకాంత్‌కి ‘జనమంచి గౌరీశంకర్ జీ యువ పురస్కార్’ను అందజేశారు.






