- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీకి బయల్దేరిన బండి సంజయ్
ఢిల్లీ పేలుడు ఘటనతో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) దిగ్భ్రాంతికి గురయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ పేలుడు ఘటనతో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) దిగ్భ్రాంతికి గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఢిల్లీ పోలీస్ కమిషనర్, కలెక్టర్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిపై ఆరా తీశారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్లేరి వెళ్లనున్నారు. పేలుడు ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రిలో పరామర్శించనున్నారు. అనంతరం ఎర్రకోట వద్దకు వెళ్లి పరిశీలించనున్నారు. మరోవైపు ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేలుడు ధాటికి 10 మంది మృతి చెందగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా పలు నగరాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు తదితర నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ముమ్మర తనిఖీలు సాగిస్తున్నారు.






