Bandi Sanjay: ఎన్నికల కోడ్ సాకుతో ‘రైతు భరోసా’ ఆపొద్దు.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుతో లక్షలాది అన్నదాతలకు ‘రైతు భరోసా’ (Raithu Bharosa)ను ఆపొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) అన్నారు.

Bandi Sanjay: ఎన్నికల కోడ్ సాకుతో ‘రైతు భరోసా’ ఆపొద్దు.. బండి సంజయ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌‌డెస్క్: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుతో లక్షలాది అన్నదాతలకు ‘రైతు భరోసా’ (Raithu Bharosa)ను ఆపొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) అన్నారు. ఇవాళ ఆయన మీడియాలో మాట్లాడుతూ.. ‘రైతు భరోసా’ పథకం ఎన్నికల కోడ్ (Election Code) కంటే ముందే జనవరి 26 ప్రారంభమైందని.. కొనసాగుతోన్న పథకమే కాబట్టి ప్రభుత్వం రైతులు పొట్ట కొట్టొద్దని కామెంట్ చేశారు. కేవలం ఎన్నికలు గ్రాడ్యుయేట్లు (Graduates), ఉపాధ్యాయుల (Teachers)కు మాత్రమే పరిమితం అన్నారు.

ఇప్పటికే ఏడాది ‘రైతు భరోసా’ సొమ్మును సర్కార్ ఎగ్గొటిందని ఆరోపించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల ఎంపికలో ఇళ్లల్లోని కుటుంబాలను ప్రమాణికంగా తీసుకోవాలని సూచించారు. ఒకవేళ ‘రైతు భరోసా’ నిధుల విడుదలలో ఎన్నికల కోడ్‌ (Election Code)తో సమస్య వస్తే.. అవసరమైతే బీజేపీ (BJP) తరపున ఈసీకి లేఖ రాసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ విషయంలో తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని.. అందరం కలిసి ఎలక్షన్ కమిషన్‌కు విజ్ఞప్తి చేద్దామని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

అదేవిధంగా రైతు భరోసా (Raithu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (Indiramma Aathmiya Bharosa), ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses), కొత్త రేషన్ కార్డులను (New Ration Cards) అర్హులందరికీ అందించకపోవడం సరైంది కాదని బండి సంజయ్‌ (Bandi Sanjay) అన్నారు. రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలు ఉండగా, మండలానికి ఒక గ్రామం చొప్పున 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేయడమేంటని సబబు కాదన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా (Raithu Bharosa)కు అర్హులైన 70 లక్షల మంది రైతులుంటే.. నేటి వరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులే జమ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే.. 9,80,000 మంది వ్యవసాయ కూలీల ఖాతాల్లో డబ్బులు వేయకపోవడమేంటని బండి సంజయ్ ప్రశ్నించారు.

Next Story