- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajasingh : రాజాసింగ్ కు బండి సంజయ్ బుజ్జగింపులు
తెలంగాణ బీజేపీ(BJP)లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ బీజేపీ(BJP)లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి సిద్ధమయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh) అనూహ్యంగా పార్టీకి రాజీనామా(Resignation) చేశారు. ఈ ఈమేరకు తన రెండు పేజీల రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు. అయితే కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) రాజాసింగ్ ను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ, తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని రాజాసింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా నేడు జరిగిన బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయడానికి నాంపల్లి బీజేపీ కార్యాలయానికి రాజాసింగ్ తన మద్దతుదారులతో చేరుకున్నారు.
అయితే రాజాసింగ్ కు సపోర్ట్ చేస్తే మిమ్మల్ని పార్టీల నుంచి, పదవుల నుంచి సస్పెండ్ చేస్తామని వారిని బెదిరించారని, తాను ఇక పార్టీలో ఉండలేక రాజీనామా చేస్తున్నానని మీడియాకు తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికను ముందుగానే రాష్ట్ర అధినాయకత్వం డిసైడ్ చేయడం తనను షాక్ కు గురిచేసిందన్నారు. ఇకపై తాను బీజేపీ ఎమ్మెల్యే కాదని, కాని హిందుత్వ అజెండాను ఎన్నటికీ వదలనని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా.. బీజేపీ అధికారంలోకి రాకూడదని బీజేపీ పెద్దలు కోరుకుంటున్నారు.
2019 నుంచి ఎన్నో కష్టాలు పడుతూ పార్టీకి సేవ చేస్తున్నాను అన్నారు. పార్టీకోసం తాను ఉగ్రవాదులకు శత్రువుగా మారానని, మీకో దండం, మీ పార్టీకి ఓ దండం అని రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు. కాగా గత కొంతకాలంగా రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే.






