- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి సంజయ్, ఈటల రాజేందర్‌కు హైకోర్టులో ఊరట
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay), ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender)కు తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో ఊరట లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay), ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender)కు తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో ఊరట లభించింది. గతంలో వారిపై నమోదైన కేసులను తాజాగా హైరోర్టు కొట్టివేసింది. 2023లో కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్‌పై, కమలాపూర్‌లో ర్యాలీలో అనుమతి లేకుండా టపాసులు పేల్చారని ఈటలపై కేసులు నమోదు అయ్యాయి.
కాగా, ఇప్పటికే సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ పోలీస్‌స్టేషన్‌లో బండి సంజయ్‌పై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. 2021 నవంబర్ 15న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేకుండా భారీ వాహనాలతో కాన్వాయ్ నిర్వహించారని ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉండగా.. ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. ఆయన కేసీఆర్‌పైన చేసిన వ్యాఖ్యల కేసునూ కొట్టివేయడంతో ఆయనకు భారీ ఊరట లభించినట్లయింది.






