- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంద్ ఎఫెక్ట్.. 9 మంది బీసీ నేతల అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో నిన్న బీసీ జేఏసీ (Backward Classes Joint Action Committee) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో నిన్న బీసీ జేఏసీ (Backward Classes Joint Action Committee) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించారు. బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని, హైకోర్టు ఆ ఆదేశాలపై ఇచ్చిన తాత్కాలిక నిలుపుదల (stay)ను వెనక్కి తీసుకోవాలని ఈ బంద్ ద్వారా డిమాండ్ చేశారు. బంద్ పిలుపుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీతో పాటు అనేక రాజకీయ పార్టీలు, సంఘాలు మద్దతు తెలిపాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అయితే ఈ బంద్ సందర్భంగా పలు ప్రాంతాల్లో కొంత మంది నేతలు హద్దులు దాటి పలు షాపులు, పెట్రోల్ బంకులు, చిరువ్యాపారుల సముదాయాలపై దాడులు చేశారు.
దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం (Tense atmosphere) నెలకొంది. అయితే ముందస్తుగానే ప్రశాంత వాతావరణంలో బీసీ బందు (BC Bandhu)కు పోలీసులు అనుమతించిన విషయం తెలిసిందే. కానీ కొంతమంది నేతలు ఇలా ఉద్రిక్త పరిస్థితులను నెలకోల్పడంతో వారిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ లో తొమ్మిది మంది బీసీ సంఘాల నేతలను కాచిగూడ పోలీసులు (Kacheguda Police) అరెస్టు చేసి.. స్టేషన్ కు తరలించారు. కాగా ఈ అరెస్టులపై రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య (R Krishnaiah) స్పందిస్తూ.. వారి అరెస్టును ఖండించారు. అలాగే బీసీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.






