లేబర్ కోడ్స్ దేశ అభివృద్ధికి బాటలు వేసే సంస్కరణలు : బండారు దత్తాత్రేయ

by Muthe.Rajitha |

దేశంలోని కార్మిక చట్టాల చరిత్రలో ఒక గొప్ప సంస్కరణలుగా మోడీ ప్రభుత్వ లేబర్ కోడ్స్ నిలిచాయని మాజీ గవర్నర్​బండారు దత్తాత్రేయ ప్రశంసించారు.

లేబర్ కోడ్స్ దేశ అభివృద్ధికి బాటలు వేసే సంస్కరణలు : బండారు దత్తాత్రేయ
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలోని కార్మిక చట్టాల చరిత్రలో ఒక గొప్ప సంస్కరణలుగా మోడీ ప్రభుత్వ లేబర్ కోడ్స్ నిలిచాయని మాజీ గవర్నర్​బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు ప్రధాన లేబర్ కోడ్స్ రూపొందించడంతో పారదర్శకత, సమర్థత, కార్మికుల సంక్షేమ దృష్ట్యా తీసుకున్న కీలక నిర్ణయం అన్నారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ

లేబర్ కోడ్స్‌ ద్వారా అందరికి సాంఘిక భద్రత, అసంఘటిత రంగం, గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫార్మ్ వర్కర్లు వంటి వర్గాలు కూడా రక్షణగా ఉంటుందన్నారు. వేతనాల్లో పారదర్శకత, సమయానుకూల సవరణలు, కార్మికుల జీవన ప్రమాణం మెరుగుపడే దిశగా మార్పులు చేశారు. మహిళా కార్మికుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని, సురక్షితమైన కార్యాలయ వాతావరణం, గౌరవప్రదమైన పని పరిస్థితులు కల్పించేందుకు నిబంధనలు ఉన్నాయని తెలిపారు. పరిశ్రమలకు సరళీకృత విధానాలు, పెట్టుబడులు, ఉత్పత్తి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, వృత్తిపరమైన భద్రత , ఆరోగ్యం తదితర అంశాలు ఈ కోడ్ ద్వారా మెరుగైన పద్ధతి లో అమల్లోకి వచ్చింది.

తాను 2017లో కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ సంస్కరణల రూపు రేఖలు సిద్ధమయ్యాయని గుర్తుచేశారు. ఈ లేబర్ కోడ్స్‌ను రూపొందించడం లో ప్రధాని మోడీ ముందుండి మార్గనిర్దేశం చేశారని చెప్పారు. తనకు బాధ్యత ఇచ్చి, ముందుండి నడిపించారని, ఈ సంస్కరణల్లో భాగస్వామిగా ఉండటం నా జీవితంలో ఒక గొప్ప గౌరవం దక్కందన్నారు. చట్టాలు కాగితం మీద మాత్రమే కాకుండా, కార్మికుల జీవితాలలో మార్పు తెచ్చేలా అమలు కావాలన్నారు. దీని కోసం ఆయా చట్టాల అమలుకు ప్రత్యేక, పటిష్ట యంత్రాంగం ఉండాలని సూచించారు. ఈ సంస్కరణలను రాజకీయ పరంగా కాకుండా, దేశ సామాజిక,ఆర్థిక అభివృద్ధి కోణంలో చూడటం అత్యవసరమని, భవిష్యత్ తరాలకు మద్దతు ఇస్తున్న మార్గదర్శక చట్టాలుగా ఉన్నాయని వెల్లడించారు.

Next Story