Bamruk-ud-Daula lake: రేపు బ‌మృకున్ - ఉద్‌- దౌలా చెరువు ప్రారంభం..

by Ramesh Naini |   (  Updated:2026-03-07 16:46:46  IST  )

పాత‌బ‌స్తీకి మ‌ణిహ‌రం చారిత్ర‌క బ‌మృకున్ - ఉద్‌- దౌలా చెరువును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించనున్నారు.

Bamruk-ud-Daula lake: రేపు బ‌మృకున్ - ఉద్‌- దౌలా చెరువు ప్రారంభం..
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రాలో మ‌హిళా దినోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు విధుల్లో నిమ‌గ్న‌మై ఉన్న మ‌హిళ‌లు.. కార్యాల‌యం వ‌దిలిపెట్టే ముందు స‌మావేశ‌మ‌య్యారు. ఓ వైపు మ‌హిళ‌ల సాధికార‌త‌పై ప్ర‌సంగాలు.. మ‌రో వైపు సంద‌డి కార్య‌క్ర‌మాలతో స‌మావేశ మందిరం ఆహ్లాదంగా మారింది. మ్యూజిక‌ల్ చైర్ ఆట‌లో చురుకుగా పాల్గొన్నారు. ర్యాంప్ వాక్‌లో పోటీ ప‌డ్డారు. ఓ వైపు సంగీతం.. మ‌రోవైపు నృత్యం మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల‌కు హైలెట్‌గా మారింది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పోటీల్లో గెలుపొందిన మ‌హిళ‌ల‌కు బ‌హుమ‌తుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ అంద‌జేశారు. కార్య ద‌క్ష‌త‌తో పాటు.. స‌మ‌ర్ధ‌వంత‌మైన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో మ‌హిళ‌లు రాణిస్తున్నార‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగనాథ్ కొనియాడారు. అన్ని రంగాల్లో పోటీపడుతున్నారు అనే ద‌శ నుంచి విజేత‌లుగా నిలుస్తున్నార‌నే ద‌శ‌కు మ‌హిళ‌లు చేరార‌ని రంగనాథ్ అన్నారు. మ‌హిళ‌లంద‌రికీ మ‌హిళాదినోత్స‌వ శుభాకాంక్ష‌లు అద‌న‌పు క‌మిష‌న‌ర్ ఆర్ సుద‌ర్శ‌న్ తెలిపారు.

బ‌మృకున్ - ఉద్‌- దౌలా చెరువు ప్రారంభం..

పాత‌బ‌స్తీకి మ‌ణిహ‌రం చారిత్ర‌క బ‌మృకున్ - ఉద్‌- దౌలా చెరువును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి అన్ని ఏర్పాట్ల‌ను సంబంధిత శాఖ‌లు పూర్తి చేశాయి. 2 వేల మందికి పైగా కూర్చునేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేశారు. స‌భ‌కు హాజ‌ర‌య్యే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. చెరువు చ‌రిత్ర‌ను చెబుతూ త‌యారు చేసిన ఏవీ ప్ర‌ద‌ర్శ‌న‌కు వెసులుబాటుగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

Next Story