- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వార్నింగ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మతిస్తిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నాడో అర్థంకాక నోటికి వచ్చినట్టు మాట్లాడతున్నాడని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మతిస్తిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నాడో అర్థంకాక నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. హుజురాబాద్ ప్రజలు అసహ్యించుకునే విధంగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు చేసిన పనులన్నీ మిగితావాళ్లు కూడా అలానే పనిచేస్తారని కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు.
కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు కౌశిక్ రెడ్డే సాక్ష్యం అన్నారు. బీఆర్ఎస్ లో ఈటల చేరుతారనే భయంతో కేసీఆర్ కుటుంబం వద్ద పేరు సంపాదించుకునేందుకే కౌశిక్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాల చెక్కులు కూడా కౌశిక్ రెడ్డి ఇవ్వకపోవడంతో ఎక్స్పైరీ డేట్ అయిపోయని అన్నారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు పైకి ఎత్తుకుంటారని కౌశిక్ రెడ్డి అనుకుంటున్నాడని, కానీ ఇలానే ప్రవర్తిస్తే మీ బతుకు కుక్కలు చింపిన ఇస్తరి అవుతుందని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తే గుడ్డులు ఊడదీసి కొట్టేపరిస్థితి వస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.






