- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి తలసానితో బళ్లారి మేయర్ గాదెప్ప భేటీ
కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని కర్ణాటక రాష్ట్రం బళ్లారి మేయర్ గాదెప్ప ప్రశంసించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని కర్ణాటక రాష్ట్రం బళ్లారి మేయర్ గాదెప్ప ప్రశంసించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గాదెప్ప సోమవారం హైదరాబాద్ నగరానికి వచ్చారు. ముందుగా జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. తన నివాసానికి వచ్చిన మేయర్ గాదెప్పను ఎమ్మెల్యే తలసాని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గాదెప్ప మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లోనూ ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. సింగపూర్, మలేషియా వంటి ప్రధాన నగరాలను తలపించేలా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దారని అన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా చేపట్టిన రహదారుల అభివృద్ధి, ఫ్లై ఓవర్‌లు, అండర్ పాస్‌ల నిర్మాణం అద్భుతంగా ఉన్నదన్నారు. దేశంలోని ప్రఖ్యాత నగరాలకు దీటుగా అభివృద్ధిలో పోటీ పడ్డారని చెప్పారు.






