- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల సంఘం పాత్ర మారుతోంది: బాలకిష్టారెడ్డి
సమాజాభివృద్ధి, దేశ నిర్మాణంలో విద్యా రంగం మరింత చురుకుగా పాలుపంచుకోవాలని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) తరహాలోనే అకడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (ఏఎస్ఆర్) వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ఆకాంక్షించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సమాజాభివృద్ధి, దేశ నిర్మాణంలో విద్యా రంగం మరింత చురుకుగా పాలుపంచుకోవాలని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) తరహాలోనే అకడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (ఏఎస్ఆర్) వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ఆకాంక్షించారు. సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని రాజనీతి శాస్త్ర విభాగం, ఓయూ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ సదస్సును ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మారిన కాలంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల పునర్నిర్మాణం, నియోజకవర్గాల పునర్విభజన, ఆర్థిక సమాఖ్య వ్యవస్థ, ఒకే దేశం-ఒకే ఎన్నిక మరియు డిజిటల్ పాలన అనే అంశంపై ఈ సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచీకరణ నేపథ్యంలో దేశానికి స్థిరమైన సమాఖ్య వ్యవస్థ ఎంతో కీలకమని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 11, 12, 13 భాగాలను ప్రస్తావిస్తూ కేంద్ర-రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీపై అవగాహన కల్పించారు. అలాగే, నియోజకవర్గాల పునర్విభజనలో ఎన్నికల సంఘం పాత్ర మారుతోందని, రాజ్యాంగంలోని 15వ భాగం (ఆర్టికల్స్ 324-329) ప్రాముఖ్యతను వివరించారు. అధ్యాపకులు, పరిశోధకులు తమ జ్ఞానాన్ని ప్రజలకు ఉపయోగపడేలా మలచాలని ఆయన సూచించారు.






