HYD: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

by Disha Web Desk 2 |
HYD: మందుబాబులకు బ్యాడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ మందుబాబులకు బ్యాడ్ న్యూస్. ఈ నెల 13న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో ఆ మూడు జిల్లాల పరిధిలో మూడు రోజుల పాటు లిక్కర్ షాపులు మూతపడనున్నాయి. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎక్సైజ్‌ శాఖ ఆదేశాల మేరకు ఎక్సైజ్‌ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11న (శనివారం) సాయంత్రం నుంచి 13 సాయంత్రం వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు (స్టార్‌ హోటళ్లలో సైతం), నేవల్‌ క్యాంటీన్స్, టూరిజం బార్స్, మద్యం డిపోలు, కల్లు దుకాణాలు కూడా మూసివేస్తున్నట్లు తెలిపారు.

అలాగే ఓట్ల లెక్కింపు జరిగే 16వ తేదీన కౌంటింగ్‌ కేంద్రం పరిసర ప్రాంతాల్లో కూడా మద్యం దుకాణాలు మూతపడతాయని తెలిపారు. అంతే కాకుండా ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఆ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇదివరకే టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ముందు రోజు, పోలింగ్ నాడు, కౌంటింగ్ తేదీన ఎన్నికల సంఘం సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story