- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KCR ఫొటోకు అజారుద్దీన్ దండంపెట్టాలి-హరీష్‌రావు
మంత్రి అజారుద్దీన్ ను ఉద్దేశించి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేం ప్రశ్నించినందుకే అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కిందని KCR ఫొటోకు అజారుద్దీన్ దండం పెట్టాలని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. అజారుద్దీన్‌కి (Azharuddin) మంత్రి పదవి వచ్చి మూడు నెలలు అయింది. కానీ ఇంకా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఇంకో 3నెలల్లో MLC కాకపోతే అజారుద్దీన్ పదవి పోతుందన్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో మాట్లాడిన హరీశ్‍రావు పోలీసులపై హాట్ కామెంట్స్ చేశారు. కొంత మంది పోలీసుల అధికారులు తమ వారిని ఇబ్బంది పెడుతున్నారని అలాంటి అధికారులందరి పేర్లు పింక్ బుక్కులో (Pink Book) రాసుకుంటున్నామన్నారు. మేము అధికారంలోకి వచ్చాక అలాంటి వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
బూతులు తిడితే కడుపు నిండుతుందా?
మా వాళ్ల జోలికి వస్తున్న పోలీసులు ఖబర్దార్ అని హెచ్చరించారు. కాంగ్రెస్ తొత్తులుగా మారితే ఊరుకునేది లేదన్నారు. కాంగ్రెస్‍కు ఓటు వేయకపోతే ఇంటి బిల్లులు రావు, పర్మిషన్లు రావని బెదిరిస్తున్నారట. ఇదేమైనా మీ అబ్బ జాగీరా? ఓటేస్తేనే మున్సిపాలిటీలకు నిధులు ఇస్తామని బ్లాక్ మెయిల్ చేయడం రేవంత్ రెడ్డి దుర్మార్గపు ఆలోచన. రేవంత్ రెడ్డికి పాలన చేతకాదు కానీ బూతులు మాత్రం బాగా వచ్చు. నన్ను, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని బూతులు తిడితే పేదోడి కడుపు నిండుతుందా? కేసీఆర్ ను తిడితే మీకు కడుపు నిండదు.. రైతుబంధు వేస్తే రైతుల కడుపు నిండుతుంది.






