జూబ్లీహిల్స్ లో పోటాపోటీగా 'ఆటో' పాలిటిక్స్.. నిన్న బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్

by Prasad Jukanti |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఆటో ప్రయాణాలు రాజకీయాన్ని మరింత ఆసక్తిగా మారుస్తున్నాయి.

జూబ్లీహిల్స్ లో పోటాపోటీగా ఆటో పాలిటిక్స్.. నిన్న బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) ప్రచారం క్రమంలో పీక్స్ కు చేరుకుంటోంది. రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలకు దిశానిర్దేశం గా మారబోతోందని అంచనా వేస్తున్న ఈ బై ఎలక్షన్‍లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ లో 'ఆటో పాలిటిక్స్' (Auto politics) ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆటోడ్రైవర్ల సమస్యల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ (Congress) పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నిక నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ (BRS) నేతలు ఆటోలలో ప్రయాణించి ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకోగా ఇవాళ మంత్రి సీతక్క (Seethakka) ఆటోలో ప్రయాణించడం చర్చనీయాశంగా మారింది. మంగళవారం జూబ్లీహిల్స్ లో ప్రచారం నిర్వహించిన సీతక్క.. ఈ సందర్భంగా ఆటోలో ప్రయాణించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యలకు ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. పేదల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపట్టిందని తెలిపారు.

కీ వెపన్‍గా ఆటో పాలిటిక్స్!:

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేశాక తమకు సమస్యలు పెరిగిపోయాయని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సామాన్య ప్రజల ప్రయాణ సౌకర్యాలలో ఆటో కీలకమైన సదుపాయం కావడం వల్ల సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆటో పాలిటిక్స్ ను ట్రిగ్గర్ చేస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామనే హామీని ప్రభుత్వం నెరవేర్చడం లేదంటూనే మహాలక్ష్మి స్కీమ్ వల్ల పురుషులు ఇబ్బందులు పడుతున్నారని కార్నర్ చేస్తోంది. గతంలో అసెంబ్లీ సమావేశాల టైమ్ లోనూ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలపై ఆందోళన చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆటో పాలిటిక్స్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షాలకు కీ వెపన్ గా మారబోతోందా? అనే చర్చ తెరమీదకు వస్తోంది. మొత్తంగా జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటాగా నడుస్తున్న ఆటో పాలిటిక్స్ లో ఎవరిది పై చేయి అవుతుందనేది వేచి చూడాలి.

Next Story