దారుణం.. అన్నదమ్ముల పరస్పర దాడులు

by Disha Web Desk 4 |
దారుణం.. అన్నదమ్ముల పరస్పర దాడులు
X

దిశ, అడ్డగూడురు : ఇద్దరూ అన్న తమ్ముళ్ల మధ్య భూతగాదా చిచ్చురేపింది. అడ్డగూడురుకు చెందిన మార్త సైదులు, వీరయ్యలు అన్నదమ్ములు. కాగా వీరికి గత కొంత కాలంగా భూతగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం గొడవపడి పెద్దమనుషుల వద్దకు వెళ్లారు. వారు బుధవారం ఉదయం మాట్లాడుకుందాం అని చెప్పారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం వీరయ్య నాగలి తీసుకుని పొలానికి వచ్చి దున్నుతున్నాడు.

అదే సమయానికి సైదులు ఆయన కొడుకు శేఖర్ ఇద్దరు కూడా వచ్చి వీరయ్యను అడ్డుకున్నారు. ఎందుకు దున్నుతున్నావు అని పరస్పరం వాదనలు చేసుకున్నారు. అదే సమయంలో వీరయ్య సైదులు ఒకరికొకరు గల్లాలు పట్టుకొని కొట్లాడుతున్న క్రమంలో సైదులు కొడుకు శేఖర్, వీరయ్య కొడుకు ప్రభాస్ అప్పటికే తమ వద్ద ఉన్న గొడ్డలితో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో దాడి చేసుకున్నారు. దీంతో నలుగురు తీవ్రస్థాయిలో గాయాల పాలయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని రామన్నపేట సీఐ మోతీరాం, అడ్డగూడురు ఎస్ఐ ఉదయ్‌లు పరిశీలించారు.

Next Story

Most Viewed