మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు నాలుగు సవరణ బిల్లులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-03 03:08:21  IST  )

తెలంగాణ శాసనసభ ఏడవ విడత సమావేశాలు మూడో రోజు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. నేటి సభా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం నాలుగు కీలక సవరణ బిల్లులను ప్రవేశపెట్టి చర్చించనున్నారు.

మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు నాలుగు సవరణ బిల్లులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ ఏడవ విడత సమావేశాలు మూడో రోజు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. నేటి సభా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం నాలుగు కీలక సవరణ బిల్లులను ప్రవేశపెట్టి చర్చించనున్నారు. ఇందులో భాగంగా మొదటగా పబ్లిక్ సర్వీసెస్ నియామకాల క్రమబద్ధీకరణ బిల్లు సభ ముందుకు రానుంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, సిబ్బంది హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణానికి సంబంధించిన సవరణ బిల్లు-2026 (బిల్లు నెం.6), దాని రెండో సవరణ బిల్లులను (బిల్లు నెం.7) ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) సభలో ప్రవేశపెట్టనున్నారు.

అదేవిధంగా పంచాయతీ రాజ్ చట్టానికి సంబంధించి రెండు కీలక సవరణ బిల్లులను (బిల్లు నెం.8, బిల్లు నెం.9) మంత్రి సీతక్క (Seethakka) సభ ముందుకు తీసుకురానున్నారు. ఇక సమావేశం చివరగా రాష్ట్రానికి అత్యంత కీలకమైన కృష్ణా నది జలాల అంశంపై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది

Next Story