Asaduddin Owaisi: BRS కింది స్థాయికి పడిపోయిన పార్టీ..! అసదుద్దీన్‌ సంచలన కామెంట్స్

by Ramesh Naini |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Asaduddin Owaisi: BRS కింది స్థాయికి పడిపోయిన పార్టీ..! అసదుద్దీన్‌ సంచలన కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. BRS కింది స్థాయికి పడిపోయిన పార్టీ అని ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. నన్ను విమర్శిస్తే బలపడతామని BRS అనుకుంటోందని అన్నారు. అజారుద్దీన్‌పై కోపం నాపై తీర్చుకుంటున్నారని కామెంట్స్ చేశారు.

ఇక బీహార్ ఎన్నికలపై ఒవైసీ మాట్లాడుతూ.. ‘బీహార్ ప్రజలు AIMIM‌కు ఓటు వేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. 5 స్థానాల్లో కష్టపడి పనిచేసిన అభ్యర్థులు, పార్టీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ వారిని అభినందిస్తున్నాను. బీహార్ ప్రజలు ఇచ్చిన తీర్పును మేము స్వీకరిస్తున్నాం. సీఎం నితీశ్ కుమార్‌కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ప్రజల అభ్యున్నతి కోసం పని చేస్తాం. నేను ఎప్పుడూ చెప్పేదే, RJD బీజేపీని ఆపలేదు. బీహార్ ప్రజలను M-Y (ముస్లిం-యాదవ్) కలయికపై తప్పుదారిపట్టించారు, నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి ఫాసిస్టు శక్తులకు ఓటు వేయొద్దు.’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story