గుడిని కూల్చిన గూండాలను అరెస్ట్ చేయరేంది.. రాంచందర్ రావు హౌస్ అరెస్ట్‌పై బండి సంజయ్ ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-12 04:46:34  IST  )

జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి వద్ద హిందూ సంఘాలు నిర్వహించ తలపెట్టిన కుంకుమార్చనకు వెళ్లకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావును పోలీసులు అరెస్ట్ చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఫైర్ అయ్యారు.

గుడిని కూల్చిన గూండాలను అరెస్ట్ చేయరేంది.. రాంచందర్ రావు హౌస్ అరెస్ట్‌పై బండి సంజయ్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి వద్ద హిందూ సంఘాలు నిర్వహించ తలపెట్టిన కుంకుమార్చనకు వెళ్లకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావును పోలీసులు అరెస్ట్ చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఫైర్ అయ్యారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతోన్న వేళ తాను బిజీగా ఉన్నా.. విషయం తెలిసిన వెంటనే తీవ్రంగా స్పందించారు. పెద్దమ్మ గుడికి హిందువులు పోతే తప్పేందని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని అన్నారు. భాగ్యనగర్‌లో హిందూ సంఘాలను, బీజేపీ (BJP) కార్యకర్తలందరినీ అరెస్ట్ చేయడం మూర్ఖత్వమని కామెంట్ చేశారు.

పక్కా పథకం ప్రకారమే కాంగ్రెస్ (Congress) వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. పెద్దమ్మ గుడిని కూల్చిన గూండాలను అరెస్ట్ చేయకుండా శాంతియుతంగా పూజలు నిర్వహించే హిందూ సంఘాల నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆరోపించారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో ఓ వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి దిక్కుమాలిన కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలు అన్నీ పరిణామాలను గమనిస్తూనే ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బండి సంజయ్ అన్నారు.

Also Read..

మంత్రి పదవి పై ఉన్న ధ్యాస అభివృద్ధి పైన పెట్టాలి

Next Story