- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Arrest: మలక్‌పేట కాల్పుల కేసు.. ముగ్గురు నిందితుల అరెస్ట్
మలక్‌పేట (Malakpet)లో కాల్పుల ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. శాలివాహననగర్ పార్క్‌లో మార్నింగ్ వాక్ వెళ్లిన సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్ (43)పై దండుగులు ఆరు రౌండ్ల పాటు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

దిశ, వెబ్‌డెస్క్: మలక్‌పేట (Malakpet)లో కాల్పుల ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. శాలివాహననగర్ పార్క్‌లో మార్నింగ్ వాక్ వెళ్లిన సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్ (43)పై దండుగులు ఆరు రౌండ్ల పాటు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో అతడు తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే, కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజేష్ (Rajesh) అతడి అనుచరులు శివ, మున్నా, భాషా పరారీలో ఉండగా.. వారిని పట్టుకునేందుకు మొత్తం తొమ్మిది సెర్చ్ టీమ్‌లో రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో నిందితులు భాషా, మున్నా, శివలను ఇవాళ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, వారిపై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇక కేసులో ప్రధాన నిందితుడు రాజేష్ కోసం వేట కొనసాగుతోంది.
కాగా, కేసులో ప్రధాన నిందితుడు రాజేశ్‌తో పాటు ప్రశాంత్, ఏడుకొండలు, సుధాకర్, మున్నా, రాయుడు, రవీంద్రా చారి, యాదిరెడ్డిలు నిందితులుగా ఉన్నట్లు ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు పేర్కొన్నారు. హత్యలో నేరుగా పాల్గొన్నది మాత్రం నలుగురేనని.. వారికి సహకరించింది మరో ఐదుగురు అని పోలీసులు తేల్చారు. చందునాయక్ హత్యలో గుడిసెల వివాదంతో పాటు వివాహేతర సంబంధం కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది.






