- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు
రాష్ట్రంలో SSC పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో SSC పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో బాలురు 2,67,954 మంది కాగా, బాలికలు 2,60,285 మంది ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 5,17,727 మంది, ఒకసారి ఫెయిల్ అయినవారు 10,512 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వ స్కూళ్లు 1582, ప్రైవేటు స్కూల్స్ 1094 ఉన్నాయి. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు 1,408 మంది పరీక్ష రాయనున్నారు.
8.30 గంటలకే చేరుకోవాలి..
విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఉదయం 9.35 గంటల వరకు మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తారని అధికారులు స్పష్టం చేశారు. 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను కేంద్రంలోకి అనుమతించరని పేర్కొన్నారు. విద్యార్థులు ఆయా స్కూల్ యూనిఫాం ధరించకూడదని విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులతో పాటు హాల్ టికెట్, ఎగ్జామ్ ప్యాడ్, పెన్, పెన్సిల్, స్కేల్, జామెట్రీ పరికరాలను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు 144 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు 163 (సీఆర్పీసీ 144) సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయనున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రతి కేంద్రంలో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులతో కూడిన ఎఎన్ఎం అందుబాటులో ఉంటారు. రవాణా ఇబ్బందులు లేకుండా బస్సు ట్రిప్పులను పెంచాలని ఆర్టీసీని కోరినట్లు అధికారులు తెలిపారు. ఏవైనా ఫిర్యాదుల కోసం హైదరాబాద్‌లోని డైరెక్టర్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ (040-23230942) ఏర్పాటు చేశారు.






