- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తొలిసారిగా అనాధ చిన్నారులకు ఆరోగ్యశ్రీ కార్డులు
తెలంగాణలో తొలిసారిగా అనాధ చిన్నారులకు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశారు. ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందుకునేలా ఆరోగ్యశ్రీ కార్డులు ఉపయోగపడనున్నాయి. ఈ కార్డుల ద్వారా10 లక్షల వరకు ఉచిత వైద్వాన్ని అనాధ చిన్నారులు అందుకోనున్నారు.

- ఉచితంగా వైద్యం అందేలా కార్డులు
- శిశువిహార్ సంరక్షణలోని చిన్నారులకు కార్డులు అందజేసిన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో తొలిసారిగా అనాధ చిన్నారులకు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశారు. ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందుకునేలా ఆరోగ్యశ్రీ కార్డులు ఉపయోగపడనున్నాయి. ఈ కార్డుల ద్వారా10 లక్షల వరకు ఉచిత వైద్వాన్ని అనాధ చిన్నారులు అందుకోనున్నారు. బేగంపేటలోని టూరిస్ట్ ప్లాజాలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లు శిశు విహార్సంరక్షణలోని అనాధ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రులు మాట్లాడారు. అనాధ చిన్నారులకు సంరక్షణతో పాటు ఆరోగ్య భద్రత కలిగించేలా ఆరోగ్యశ్రీ కార్డులను అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనాధ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో కుటుంబం లేదని బాధను తీరుస్తున్నామని, తల్లిదండ్రులు లేని పిల్లలంతా ప్రభుత్వ బిడ్డలే అన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయి ఎవరు ఆసరాగా లేనప్పుడు శిశు సంక్షేమ శాఖ జిల్లా యంత్రాంగాలు చిన్నారులను చేరదీస్తున్నాయన్నారు. చిన్నారులను ఆదరించడం మన బాధ్యత అని, తల్లిదండ్రులు లేని లోటును తీర్చి.. వాళ్ళు ఎదిగేలా మానసిక ధైర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తూ ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మొదటి సారిగా హైదరాబాదులో 2200 మంది అనాధలకు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులను అందజేస్తున్నామని, దీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేస్తానమి పేర్కొన్నార. అనాధ పిల్లల సంరక్షణ చేస్తే నెలకు రూ.4500 ఇస్తామని, అనాధల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. అనంతరం మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్, ఇతర ప్రముఖులు అనాధ చిన్నారులతో కలిసి భోజనం చేశారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి తదితరులు పాల్గొన్నారు.






