Tirumala : తిరుమలకు ఫిబ్రవరిలో వెలుతున్నారా..ఇవి తెలుకోండి!

by Y. Venkata Narasimha Reddy |

తిరుమల శ్రీవారి సందర్శన(Tirumala Srivari Visit)కు ఫిబ్రవరిFebruary మాసంలో వెళ్లే భక్తుల(Devotees)కు టీటీడీ(TTD) కీలక సమాచారం అందించింది. తిరుమలలో ఫిబ్రవరి నెలలో విశేష పర్వదినాల వేళ స్వామివారి దర్శనానికి ఆసక్తి చూపే భక్తులకు పర్వదినోత్సవాల వివరాలు వెల్లడించింది.

Tirumala : తిరుమలకు ఫిబ్రవరిలో వెలుతున్నారా..ఇవి తెలుకోండి!
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి సందర్శన(Tirumala Srivari Visit)కు ఫిబ్రవరిFebruary మాసంలో వెళ్లే భక్తుల(Devotees)కు టీటీడీ(TTD) కీలక సమాచారం అందించింది. తిరుమలలో ఫిబ్రవరి నెలలో విశేష పర్వదినాల వేళ స్వామివారి దర్శనానికి ఆసక్తి చూపే భక్తులకు పర్వదినోత్సవాల వివరాలు వెల్లడించింది. ఫిబ్రవరి 2 - వసంత పంచమి పర్వదినోత్సవం, ఫిబ్రవరి 4 - రథ సప్తమి, ఫిబ్రవరి 5 - భీష్మాష్టమి, ఫిబ్రవరి 6 - మధ్వనవమి, ఫిబ్రవరి 8 - భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి 12 - శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 24 - సర్వ ఏకాదశి, ఫిబ్రవరి 26 - మహాశివరాత్రి విశేష పర్వదినాలుగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.

ప్రధానంగా శ్రీవారి రథసప్తమి వేడుక(Srivari Ratha Saptami Celebrations)ల్లో అధిక సంఖ్యలో పాల్గొంటారని టీటీడీ తెలిపింది. ప్రతీ సంవత్సరం శుక్లపక్ష సప్తమి తిథిలో సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమిని ఘనంగా జరుపుతారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా మలయప్ప స్వామి ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభం కానున్నాయి. రథసప్తమి వేడుకలకు దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తుండగా.. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా స్వామి వారి దర్శనం కల్పించాలని భావిస్తున్నారు. మరోవైపు.. రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారికి సంబంధించి పలు సేవలను రద్దు చేశారు. ఇక భక్తులకు బ్రేక్ దర్శనాలు, స్పెషల్ దర్శనాలు కూడా రద్దు చేస్తున్నట్లు ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు.

మరోవైపు తిరుమలకు వచ్చే భక్తులు దర్శించుకునే తిరుపతి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యం(Tirupati Sri Govindaraja Swamy Temple)లో ఫిబ్రవరి నెల‌లో విశేష ఉత్సవాల వివరాలను కూడా వెల్లడించారు. ఫిబ్రవరి 4న రథసప్తమి, ఫిబ్రవరి 6 నుండి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు, 14, 21, 28వ తేదీల్లో శుక్రవారం శ్రీ ఆండాళ్ అమ్మవారికి, శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 15న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీగోవిందరాజస్వామివారికి తిరుమంజనము, ఆస్థానం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 20న‌ అధ్యయనోత్సవాలు ముగుస్తాయి. ఫిబ్రవరి 26న‌ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారికి అభిషేకం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.

అటు తిరుమల పరిధిలోని మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి శ్రీ కోదండరామాలయం(Tirupati Sri Kodandaramalayam)లో ఫిబ్రవరి నెల విశేష ఉత్సవాలు వివరాలను కూడా టీటీడీ వెల్లడించింది. శ్రీ కోదండ రామాలయంలో ఫిబ్రవ‌రి 1, 8, 15, 22వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం రాత్రి 7 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. ఫిబ్రవ‌రి 10న పున‌ర్వసు న‌క్షత్రాన్ని పుర‌స్కరించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీ రామ‌చంద్ర పుష్కరిణి వ‌ద్దకు ఊరేగింపుగా తీసుకెళ‌తారు. సాయంత్రం 6.30 గంట‌ల‌కు ఊంజ‌ల్‌సేవ నిర్వహిస్తారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు. ఫిబ్రవ‌రి 13న పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారికి కూపుచంద్రపేట ఉత్సవం వైభ‌వంగా నిర్వహిస్తారు. ఫిబ్రవ‌రి 28న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు. రాత్రి 7.00 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహిస్తారు.

Next Story