హిడ్మా స్థానంలోకి మరో టాప్ కమాండర్.. ఇతనూ ఆ పూవర్తి బిడ్డే?

by Gantepaka Srikanth |

హిడ్మా.. హిడ్మా.. హిడ్మా.. ఎక్కడ చూసినా గతకొన్ని రోజులుగా ఇదే పేరు వినిపిస్తోంది. హిడ్మా(Maoist Hidma).. దండకారణ్యంలో కీలకమైన నాయకుడు.

హిడ్మా స్థానంలోకి మరో టాప్ కమాండర్.. ఇతనూ ఆ పూవర్తి బిడ్డే?
X

దిశ, వెబ్‌డెస్క్: హిడ్మా.. హిడ్మా.. హిడ్మా.. ఎక్కడ చూసినా గతకొన్ని రోజులుగా ఇదే పేరు వినిపిస్తోంది. హిడ్మా(Maoist Hidma).. దండకారణ్యంలో కీలకమైన నాయకుడు. ఆయన స్కెచ్ వేస్తే కచ్చితంగా పని జరగాల్సిందే. అటువంటి చురుకైన మావోయిస్టు నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కన్నుమూశాడు.. దీంతో హిడ్మా మరణం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని.. ఆయన మృతితో మావోయిస్టుల ఉనికి ప్రమాదంలో పడిందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరో కీలకమైన మావోయిస్టు నాయకుడి పేరు తెరపైకి వచ్చింది. హిడ్మా స్థానాన్ని మావోయిస్టు పార్టీ కీలక నేత, టాప్ కమాండర్‌గా కొనసాగుతున్న బర్సీ దేవా(Maoist Barsi Deva) భర్తీ చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో పోస్టులు సైతం వైరల్‌గా మారాయి. హిడ్మా సొంతూరు అయిన.. పూవర్తి గ్రామానికి చెందిన బర్సీ దేవా 30 ఏళ్లకు పైగా దళంలో కొనసాగుతున్నారు. హిడ్మాతో కలిసి అనేక ఆపరేషన్లలో పాల్గొన్నట్లు సమాచారం. ఇక నుంచి హిడ్మా పాత్రను బర్సీ దేవా పోషించబోతున్నట్లు తెలుస్తోంది. కానీ.. ఆయనపై అటు మావోయిస్టులు, ఇటు పోలీసులు ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం బర్సీ దేవా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. వీడియో

Next Story