ఇంకా ముందుకు వెళ్లడం సాధ్యం కావట్లేదు.. టన్నెల్ ప్రమాదంపై మంత్రి జూపల్లి మరో ప్రకటన

by Gantepaka Srikanth |

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident)పై మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) మరో కీలక ప్రకటన చేశారు.

ఇంకా ముందుకు వెళ్లడం సాధ్యం కావట్లేదు.. టన్నెల్ ప్రమాదంపై మంత్రి జూపల్లి మరో ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident)పై మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) మరో కీలక ప్రకటన చేశారు. ఆదివారం ఉదయం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. రెస్క్యూ టీమ్ కార్మికులు చిక్కుకున్న 100 మీటర్ల ప్రాంతం వరకు వెళ్లగలిగారు. పైకప్పు కూలడంతో మట్టి, బుదర చేరుతోంది. రెస్క్యూ టీమ్ ఇంకా ముందుకు వెళ్లడం సాధ్యం కావట్లేదు. ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితిని అధికారులతో కలిసి నిత్యం పరీక్షిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

మరోవైపు.. నాలుగు గంటల తరువాత టన్నెల్ నుంచి NDRF బృందం తిరిగి వచ్చింది. 12 కిలో మీటర్లు అండర్ టన్నెల్ ట్రైన్‌లో ప్రయాణించి అక్కడి నుండి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. మోకాలు లోతు వరకు నీరు నిండి ఉండడంతో ముందుకు వెళ్లలేకపోయారు. మొత్తం ఆరు మీటర్ల మీద బురదతో నిండిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఫ్లై కెమెరాతో లోపల దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సాంకేతిక మిషనరీతో లోపలికి వెళ్లాలని NDRF బృందాలు చెబుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోసారి లోపలికి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు.. ఫ్లోరైడ్ ప్రాంతంగా ఉన్న నల్గొండ జిల్లాకు నీటి నిర్వహణ తక్కువ వ్యయంతో ఉండే విధంగా రూపొందించిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్ఎల్బీసీ) కి మొదటి నుంచి అడ్డంకులు, అవాంతరాలే ఎదురవుతున్నాయి. రెండు దశాబ్దాలు అయినా పనులు మాత్రం పూర్తి కావడం లేదు. 2005 ఆగస్టులో ప్రారంభించినా ఇప్పటివరకూ పూర్తి కాలేదు. తాజాగా ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం పనులు పున: ప్రారంభించగా.. నిన్న జరిగిన అనూహ్య ప్రమాదంతో మరోసారి పనులు ఆగిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Next Story