- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: పీజేఆర్‌కు మరో అరుదైన గౌరవం
దివంగత పి.జనార్థన్‌రెడ్డి(PJR)కి మరో అరుదైన గౌరవం లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: దివంగత పి.జనార్థన్‌రెడ్డి(PJR)కి మరో అరుదైన గౌరవం లభించింది. బోరబండ చౌరస్తాకు ‘పీజేఆర్ బోరబండ చౌరస్తా’గా నామకరణం చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. శనివారం బోరబండలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని రివీల్ చేశారు. అంతేకాదు.. పీజేఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. స్వయంగా తానే ఆవిష్కరిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. పీజేఆర్ మరణించినప్పుడు ఆయన కుటుంబంలోని వ్యక్తిని ఏకగ్రీవం చేద్దామంటే కేసీఆర్ ఒక్కడే ఒప్పుకోలేదని గుర్తుచేశారు. చంద్రబాబు, బీజేపీ కూడా పీజేఆర్‌పై ఉన్న గౌరవంతో రాజకీయ వైరుధ్యాన్ని పక్కన పెట్టారని, పీజేఆర్ కుటుంబానికి అండగా నిలిచి.. మరణించిన కుటుంబంలో ఏకగ్రీవానికి ప్రయత్నించారని తెలిపారు. కానీ కేసీఆర్ మాత్రం సంప్రదాయాన్ని తుంగలో తొక్కి.. దుష్ట సంప్రదాయానికి తెరలేపారని మండిపడ్డారు. కాగా, ఇటీవలే కొండాపూర్ నుంచి ఓఆర్‌ఆర్ వరకు నిర్మించిన పి.జనార్థన్‌రెడ్డి(పీజేఆర్) ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే.






