కర్రిగుట్టల్లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి?

by Kema Shiva Kumar |

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన కర్రిగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది.

కర్రిగుట్టల్లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి?
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన కర్రిగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బీజాపూర్ జిల్లా ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాజేడు మండలం లంకపల్లి అటవీ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఎదురు‌కాల్పుల్లో మొత్తం 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ చంద్రన్న, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ బండి ప్రకాష్ కూడా ఉన్నట్లుగా సమాచారం. అయితే, ఎన్‌కౌంటర్ కొనసాగుతోన్న సమయంలోనే మావోయిస్టులు చాకచక్యంగా ల్యాండ్‌మైన్ బ్లాస్ట్ చేశారు. ఈ భారీ పేలుడు కారణంగా కూబింగ్‌లో ఉన్న మొత్తం ఐదురుగు గ్రేహౌండ్స్ పోలీసులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పో్యారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మృతి చెందిన వారికి మృతదేహాలను ఏటూరు నాగారం ప్రభుత్వాసుపత్రికి, ల్యాండ్‌మైన్ బ్లాస్ట్‌లో గాయపడిన భద్రతా సిబ్బందిని చికిత్స నిమిత్తం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Next Story