- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఈ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (low pressure) తీవ్ర వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఈ వర్షాల కారణంగా వచ్చిన వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తెలంగాణకు వాతావరణ శాఖ మరో చేదు వార్తను అందించింది. ఈ రోజు ఉదయం బంగాళాఖాతం (Bay of Bengal)లో మరో అల్పపీడనం (Another low pressure) ఏర్పడింది. దీంతో రాగల 48 గంటల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది.
ఇందులో భాగంగా దక్షిణ తెలంగాణ (South Telangana) జిల్లాలు అయిన నాగర్‌కర్నూల్, నల్గొండ, గద్వాల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డిలలో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి సాయంత్రం - రాత్రి సమయంలో భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉంది. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి - కొత్తగూడెంలో సాయంత్రం - రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు (Moderate rains) కురవనున్నాయి. దీంతో పాటుగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో.. సాయంత్రం వేళల్లో కొద్దిసేపు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.






