- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. బ్యాలెట్ పేపర్‌తోనే మున్సిపల్ ఎన్నికలు!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ (Ballot Paper)తోనే నిర్వహించాలని, అందుకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచనాప్రాయంగా ఆదేశాలు అందినట్లు సమాచారం. అయితే, 2014లో ఈవీఎంలతో, 2020లో కరోనా కారణంగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా ఈవీఎం (EVM)లతో నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ, బ్యాలెట్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈవీఎంలపై కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజల్లో ఉన్న అపనమ్మకం ఒక కారణమైతే, బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించడం సులభం, పారదర్శకత ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
హోరాహోరీ పోరు తప్పదా..
కాగా, మరోవైపు తుది ఓటర్ల జాబితా జనవరి 10న ప్రచురణకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితా కూడా విడుదలైంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల చివర్లో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ప్రత్యేకాధికారి పాలన కొనసాగుతోంది. ఇక, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ Congress పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న నేపథ్యంలో, మున్సిపల్ ఎన్నికల్లో తమదే విజయమని ఆత్మవిశ్వాసంతో కదనరంగంలోకి దిగుతోంది. బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) వంటి ప్రతిపక్షాలు ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో కాస్త బలం పుంజుకున్న తరుణంలో ఈ ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.






