Mallareddy: మల్లారెడ్డిని పదవి నుంచి తీసేయండి.. మామ అల్లుళ్లపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు

by Prasad Jukanti |

మాజీ మంత్రి మల్లారెడ్డిని మరో వివాదం చుట్టుముట్టింది.

Mallareddy: మల్లారెడ్డిని పదవి నుంచి తీసేయండి.. మామ అల్లుళ్లపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తనదైన స్టైల్ లో స్పీచ్‌లతో అదరగొడుతూ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ఉండే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని (Mallareddy) మరో వివాదం చుట్టుముట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని అందువల్ల ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు కోట శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajasekhar Reddy) వందల కోట్ల విలువైన ఆస్తులను దాచిపెట్టి, తప్పుడు అఫిడవిట్ తో (Affidavit) ఎన్నికల కమిషన్ ను, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఆర్టీఐ ద్వారా సేకరించిన పక్కా సమాచారంతో తాము ఈ ఆరోపణలు చేస్తున్నామని వెంటనే ఈ మామ అల్లుళ్ళ సభ్యత్వాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

మల్లారెడ్డిపై ఈసీ, హైకోర్టుకు..:

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచంపల్లి, కండ్లకోయ, దూలపల్లి గ్రామాల్లో దాదాపు రూ. 200 కోట్ల విలువైన 21 ఎకరాల భూమిని మల్లారెడ్డి తన అఫిడవిట్ లో వెల్లడించలేదని, దూలపల్లి లో రూ. 100 కోట్లకు పైగా విలువైన 2 ఎకరాల భూమిని రాజశేఖర్ రెడ్డి ప్రకటించలేదని కోట శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ద్వారా కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధారాలను సేకరించిదని వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ త్వరలోనే తాము ఎన్నికల సంఘం, హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు కూడా చేయబోతున్నామని తెలిపారు. మల్లారెడ్డికి సంబంధించిన అనేక అక్రమాలు త్వరలోనే బయటపడతాయని ఆరోపించారు. ఇన్నాళ్లు పేదల రక్తం పీల్చుకుతిన్న మల్లారెడ్డి ఆటలు ఇక సాగనివ్వమని హెచ్చరించారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మల్లారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌ గా మారింది.

కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మల్లారెడ్డి:

మల్లారెడ్డి సోషల్ మీడియాలో ఎంత ఫేమసో రాజకీయంగా అంతే కాంట్రవర్సీగా మారుతున్నారు. మల్లారెడ్డిపై పెద్ద ఎత్తున భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆయనతో పాటు ఆయన అల్లుడిపై కూడా భూకబ్జా ఆరోపణలు గుప్పుమన్నాయి. వీటితో పాటు మల్లారెడ్డి మెడికల్ యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కళాశాలపై విమర్శలు సైతం వెల్లువెత్తున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మల్లారెడ్డి ఇటీవల రాజకీయంగా మరింత చర్చనీయాశం అవుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి దిగిపోయిన నేపథ్యంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం సంచలనం రేపింది. ఇటీవల మల్లారెడ్డి కోడలు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో భేటీ కావడం రాజకీయంగా వైరల్ గా మారింది. ఈ క్రమంలో తాజాగా మల్లారెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని కాంగ్రెస్ ఆరోపించడం సెన్సేషన్ గా మారింది.

Next Story