- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Group-1 వివాదం మరో మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు
గ్రూప్-1 ఫలితాల రద్దు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో మరో అప్పీల్ దాఖలైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించిన గ్రూప్-1 (Group-1)విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రూప్-1 ఫలితాలు రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై మరో అప్పీలు దాఖలైంది. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి అప్పీలు దాఖలు చేశారు. అభ్యర్థి అప్పీలును సీజే ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
టీజీపీఎస్సీ సైతం:
గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఏడాది మార్చి 10న వెలువరించిన గ్రూప్-1 ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంగింగ్ లిస్టు, మార్కుల జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 9వ తేదీన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై టీజీపీఎస్సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మా వాదనలను ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంటూ ఈ తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీలు చేసింది. తాజాగా గ్రూప్-1 కు ఎంపికైన అభ్యర్థి సైతం అప్పీలుకు వెళ్లడంతో గ్రూప్-1 వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి.






