- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందెశ్రీ కృషి చిరస్థాయిగా నిలిచే ఉంటుంది.. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క
ప్రత్యేక రాష్ట్ర సాధనలో రచయిత అందెశ్రీ (Ande Sri) చేసిన కృషి చిరస్థాయిగా నిలిచే ఉంటుందని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkatreddy), సీతక్క (Seethakka) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రత్యేక రాష్ట్ర సాధనలో రచయిత అందెశ్రీ (Ande Sri) చేసిన కృషి చిరస్థాయిగా నిలిచే ఉంటుందని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkatreddy), సీతక్క (Seethakka) అన్నారు. ఇవాళ అందెశ్రీ హఠాన్మరణం పట్ల హైదరాబాద్‌లో ఆయన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. అందెశ్రీ తనకు అత్యంత ఆప్తుడని అన్నారు. ఆయన అకాల మరణం వ్యక్తిగతంగా తనను తీవ్రంగా కలచివేసిందని కామెంట్ చేశారు. ‘జయ జయహే తెలంగాణ’ అని ముక్కోటి గొంతుకైన అందెశ్రీ స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో చేసిన కృషి చిరస్థాయిగా నిలిచే ఉంటుందని అన్నారు. తీవ్ర విషాదంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
అందెశ్రీ సేవలు అపూర్వం.. మంత్రి సీతక్క
తెలంగాణ ప్రజా సాహిత్యానికి రచయిత అందెశ్రీ చేసిన సేవలు అపూర్వమని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. ఆయన అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో ఆయన రచనలు, గీతాలు ప్రజల్లో చైతన్యం, ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయని గుర్తుచేశారు. అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం రాష్ట్ర గీతంగా ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా ఆలపిస్తోందని అన్నారు. తెలంగాణ ఉన్నంత వరకు అందెశ్రీ అందించిన చైతన్యం సజీవమని మంత్రి సీతక్క అన్నారు.
READ MORE .....






