- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amit Shah: కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
నిర్దేశించిన గడువులోపు దేశంలో మావోయిస్టులు లేకుండా నిర్మూలిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఈ ఏడాది మార్చి 31 గడువు నాటికి దేశం నుండి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) పునరుద్ఘాటించారు. ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దులోని కర్రిగుట్ట కొండల్లో (Operation Karregutta) గతేడాది వేసవిలో 21 రోజుల పాటు 45 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య కఠినమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నా మన దళాలు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా 31 మంది మావోయిస్టులను హతమార్చాయన్నారు. అసాధారణ ధైర్యం ప్రదర్శించిన భద్రతాదళాలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఇవాళ ఈశాన్య ప్రాంతంలో తొలిసారిగా జరిగిన 87వ సీఆర్‍పీఎఫ్ దినోత్సవ పరేడ్‌లో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో రాళ్లదాడుల ఘటనలు జరగడం లేదని, మణిపూర్‌లో జాతి హింస నియంత్రణలో ఉందన్నారు.
‘రెడ్ టెర్రర్’ నుంచి విముక్తి:
మావోయిస్టులను సీఆర్పీఎఫ్ గట్టి దెబ్బ కొట్టడంలోనూ సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషించిందన్నారు. నక్సలిజం ఒకప్పుడు 12 రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో వ్యాపించిందని, దానిని నిర్మూలించాలన్న కేంద్ర సంకల్పాన్ని అమలు చేయడంలో సీఆర్‍పీఎఫ్, కోబ్రా దళాలు అత్యంత కీలక పాత్ర పోషించాయని చెప్పారు. కేవలం మూడు సంవత్సరాల్లో ఈ క్లిష్టమైన లక్ష్యాన్ని సాధించగలిగామని పేర్కొన్నారు. సీఆర్‍పీఎఫ్, కోబ్రా దళాలు ‘రెడ్ టెర్రర్’ నుంచి దేశాన్ని విముక్తి చేయడంలో కీలక పాత్ర పోషించాయన్నారు.






