- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్‌కు రోజులు దగ్గరపడ్డాయ్: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించేవరకు తమ పోరాటం కొనసాగుతోందని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించేవరకు తమ పోరాటం కొనసాగుతోందని కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. చేవేళ్లలో బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప సభలో ముఖ్య అతిథిగా పాల్గొని అమిత్ షా మాట్లాడారు. భారత్ మాతాకీ జై అంటూ ప్రసంగం ప్రారంభించిన అమిత్ షా.. బసవన్నకు పాదాభివందనం చేసి.. యాదగిరి లక్ష్మీ నరసింహా స్వామిని స్మరించుకున్నారు.
ఢిల్లీలో ఉన్న ప్రధాని మోడీకి చప్పుడు వినపడేలా గట్టిగా నినాదించాలని పార్టీ కార్యకర్తలను ఆయన ఉత్సాహాపరిచారు. అనంతరం కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రజాగ్రహాన్ని దేశమంతా చూస్తోందన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కేసీఆర్ ప్రభుత్వం జైల్లో వేసిందని ఫైర్ అయ్యారు.
Next Story






