Indian elections: భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం.. బీజేపీ స్పందన ఇదే!

by Prasad Jukanti |

భారత రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మన దేశ ఎన్నికల్లో అమెరికా జోక్యం వ్యవహారం కలకలం రేపుతున్నది.

Indian elections: భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం.. బీజేపీ స్పందన ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత దేశ అంతర్గత వ్యవహారాలు, సార్వత్రిక ఎన్నికల్లో (Indian Elocutions) అమెరికా కలగజేసుకుంటోందనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అనుమానాలను బలపరుస్తూ తాజాగా ఎలోన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్) (DOGE) సంచలన విషయాలు బయటపెట్టింది. యూఎస్ పన్ను చెల్లింపుదారుల ఖర్చులకు సంబంధించిన ప్రతిపాదనలను రద్దు చేస్తున్నట్లు శనివారం డోజ్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. అయితే ఈ జాబితాలో భారతదేశంలో ఓటర్ల సంఖ్య కు పెంచేందుకు అమెరికా ప్రభుత్వం 21 మిలియన్ డాలర్ల టాక్స్ పేయర్ల డబ్బును వెచ్చించాలనే ప్రతిపాదన ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే మనకు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో రాజకీయ పరిస్థితులను బలోపేతం చేయడం కోసం 29 మిలియన్ డాలర్లు, నేపాల్ లో ఫిస్కల్ ఫెడరలిజం కోసం 20 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. వీటితో పాటు ఆయా దేశాల్లో ఖర్చు చేసేందుకు నిర్ణయించిన మరికొన్ని ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనలు రద్దు చేస్తున్నట్లు డోజ్ వెల్లడించడంతో ఈ వ్యవహారంల వెలుగు చూసింది. అయితే ఇప్పుడీ విషయం భారత రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. డోజ్ ప్రకటనపై బీజేపీ నేత అమిత్ మాల్వియా తన ఎక్స్‌ వేదికగా స్పందిచారు. 21మిలియన్ డాలర్లు వోటర్ల కోసం? ఇది ఖచ్చితంగా భారతదేశ ఎన్నికల ప్రక్రియలో బాహ్య జోక్యం. దీని వల్ల ఎవరు లాభపడతారు? ఖచ్చితంగా అధికార పార్టీ కాదు. అని పోస్టు చేశారు. ఇక ఈ పరిణామం మన దేశ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడమేనని దీనిపై మోడీ సర్కార్ విచారణ జరిపించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఏమిటీ డోజ్:

ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే ఈ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (Department of Government Efficiency) పని. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన విజయానికి సంపూర్ణ మద్దతు అందించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ను ట్రంప్ ఈ డోజ్ శాఖకు సారథిగా నియమించారు. అప్పటి నుంచి మస్క్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Next Story