- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Police: డిగ్రీ లేని పోలీసులకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గుడ్ న్యూస్
పోలీస్ శాఖతో కీలకతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కీలక ఒప్పందం చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: డిగ్రీ పూర్తి చేయని కానిస్టేబుళ్లు, ఏఎస్ఐ, ఏఆర్ఎస్ఐకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. వీరంతా దూరవిద్య విధానంలో డిగ్రీ పూర్తి చేసేలా బీఆర్ఏవోయూ, తెలంగాణ పోలీసు శాఖ (Telangana Police) మధ్య ఇవాళ ఎంవోయూ కుదిరింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ (DGP Jitender), అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Ambedkar Open University) వైస్ చాన్స్‌లర్ ప్రొ.ఘంటా చక్రపాణి (Ghanta Chakrapani) సమక్షంలో ఎంవోయూ పత్రాలను అధికారులు మార్చుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఘంటా చక్రపాణి.. ఇవాళ జరిగిన ఎంవోయూ చారిత్రాత్మకమైనదని అన్నారు. అనేక అంశాల్లో తెలంగాణ పోలీసు వ్యవస్థ అగ్రగామిగా ఉందని, నేరాల అదుపులో, రికవరీలో, శాంతిభద్రతలు కాపాడే విషయంలో మన పోలీసులకు మంచి పేరుందన్నారు. ఇటువంటి పోలీస్ శాఖలోని సిబ్బంది 100 శాతం గ్రాడ్యుయేషన్ సాధిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ ముందడుగు పడిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శాఖలో 30-35 వేల మంది సిబ్బంది ఇంటర్మీడియేట్ లేదా ఆ కింది స్థాయిలోనే చదువులు ఆపేసి ఉద్యోగానికి వచ్చిన వారు ఉన్నారని చెప్పారు. ఇటీవల ఓ సందర్భంలో డీజీపీని కలిసినప్పుడు ఈ విషయం చర్చకు రావడంతో వెంటనే జితేందర్ స్పందించి దీన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సహకరించారని తెలిపారు. 10+2 పూర్తి చేసిన ప్రతి ఒక్క పోలీసు డిగ్రీ పూర్తి చేసిన పోలీసు అయి ఉండాలనే తమ ఆలోచనకు డీజీపీ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
బెటర్ పోలీసింగ్ కోసం స్పెషల్ సబ్జెక్టులు..
అంబేడ్కర్ యూనివర్సిటీలో సాధారణంగా ఎవరైనా విద్యార్థి ఆరేళ్లలో డిగ్రీ పూర్తి చేయవచ్చని, అయితే ఇప్పుడు చేరే పోలీసులు రాబోయే ఐదేళ్లలో తమ డిగ్రీ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఘంటా చక్రపాణి చెప్పారు. బెటర్ పోలీసింగ్ కోసం అదనంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. అదనపు సమాచారంతో కూడిన సబ్జెక్టులు అందజేస్తామన్నారు. ఉత్తమ పోలీసింగ్‌కు అవసరమైన మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లోనూ అందిస్తామన్నారు. పోలీసులు తమ విధులను నిర్వహించుకుంటూనే డిగ్రీ పూర్తి చేయాల్సి ఉన్న నేపథ్యంలో వారి డ్యూటీలను సర్దుబాటు చేసుకునేలా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లను స్టడీ సెంటర్లుగా కన్వర్ట్ చేయనున్నట్లు వెల్లడించారు.






